రూ.1000 సాయమేంటి బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై నెటిజన్ల ట్రోలింగ్!

Bandla-ganesh-gets-trolled-for-his-latest-tweet Bandla Ganesh, Pawan Kalyan, Troll, Tollywood, Tweet Viral, Social Media, Molagara Venkataiah

తెలుగు ప్రేక్షకులకు నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గణేష్ ఒకవైపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో రాజకీయాలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

 Bandla-ganesh-gets-trolled-for-his-latest-tweet Bandla Ganesh, Pawan Kalyan, Tr-TeluguStop.com

బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు గణేష్.

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.పవన్ పై ఎవరైనా విమర్శలు గుప్పిస్తే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ వారిపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

బండ్ల గణేష్ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారు విమర్శించే వారు కూడా అంతేమందే ఉన్నారు.ఈయన తనకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.అసలేం జరిగిందంటే.తాజాగా బండ్ల గణేష్ దృష్టికి ఒక బాధాకరమైన సంఘటన వచ్చింది.మేడ్చల్ కి చెందిన మొల్లంగర వెంకటయ్యకు ముగ్గురు కూతుళ్లు.

వారు చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లానే ఆడుతూ పాడుతూ తిరిగారు.కానీ వారికీ టీనేజ్ వచ్చాక సడన్ గా ముగ్గురు అంగవైకల్యానికి గురయ్యారు.

దాంతో వెంకటయ్య వైద్యం కోసం ఉన్నదంతా అమ్మినా ప్రయోజనం లేకుండా పోయింది.ఆయన కూతుళ్లు నడవలేకపోతున్నారు.

దీంతో వెంకటయ్య చేసేది ఏమీ లేక ఒక వీడియోని షేర్ చేస్తూ వారిని ఆదుకోవాలని ప్రార్థించాడు.ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి చేరేలా చేయాలి అనుకున్నారు.

అలాగే దాతలు ఆర్థిక సహాయం చేయాలని వాట్సాప్ నంబర్ జోడించారు.ఈ వీడియోపై బండ్ల గణేష్ స్పందించారు.వెంకటయ్య కుటుంబానికి రూ.1000 సహాయం చేశాడు.గూగుల్ పే చేసి, స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఈ విషయంలో బండ్ల గణేష్ పై మండిపడుతున్నారు నెటిజన్స్.

కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాత, వ్యాపారస్తుడు అయ్యుండి ఏదో మధ్యతరగతి వాడిలా వెయ్యి రూపాయలు సహాయం చేయడం ఏంటని నెటిజన్స్ తప్పుబడుతున్నారు.స్పందించి ఎంతో కొంత సహాయం చేశారు మంచిది.

కానీ చీఫ్ గా వెయ్యి రూపాయలేంటి.అది నీ రేంజ్ కాదన్నా, అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది.మరి ఈ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇంకొందరు అయితే ఆ వెయ్యి రూపాయలు కూడా వేయకుండా ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube