ఆ ఆడియో నాది కాదు.. లీకైనా ఆడియో గురించి బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా, కమెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానో మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఆ విషయం పై రియాక్ట్ అవుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు.

అంతేకాకుండా ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇక బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక రేంజ్ లో హడావిడి చేస్తూ ఉంటాడు.

అంతేకాకుండా ఇప్పటికే బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో చాటిచెప్పాడు.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తనను రాకుండా తివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుకున్నారు అంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Bandla Ganesh Clarity On Leaked Audio About Trivikram Details, Bheemla Nayak, B

ఆ ఆడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని దూషిస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Bandla Ganesh Clarity On Leaked Audio About Trivikram Details, Bheemla Nayak, B

అందుకు సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ ఆ వీడియో క్లిప్ పై స్పందించాడు.ఆ వీడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారు అంటూ ఆ విషయాన్ని కొట్టిపారేశాడు బండ్ల గణేష్.

అయితే దీనిపై అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం బండ్ల గణేష్ ఇష్టపడకపోవడం గమనార్హం.ఇకపోతే పవన్‌ కల్యాణ్‌, రానా మల్టీస్టారర్ లుగా నటించిన భీమ్లా నాయక్‌ చిత్రం ఈనెల 25న రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు