గత కొన్ని రోజులుగా నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) పదే పదే గురూజీ అనే పదం తో వరుస ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.ఆ ట్వీట్స్ కారణం గా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి తనను దూరం చేసింది గురూజీ అంటూ బండ్ల గణేష్ చేస్తున్న విమర్శల కారణంగా ప్రతి రోజు హాట్ టాపిక్ గా ఉంటుంది.ఇటీవల గురూజీ పై బండ్ల గణేష్ చేస్తూ తనదైన శైలి లో కౌంటర్ చేస్తున్నాడు.
పతాక స్థాయి కి చేరడం తో ముందు ముందు ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బండ్ల గణేష్ గురూజీ అంటూ వ్యాక్యలు చేస్తున్నది ఎవరి గురించో అందరికీ తెలిసిందే.
అయినా కూడా కొందరు బండ్ల గణేష్ కి మద్దతు తెలుపుతున్నారు.కొందరు మాత్రం బండ్ల గణేష్ తీరుని విమర్శిస్తున్నారు.
ఆయన పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు కావాలని బండ్ల గణేష్ కౌంటర్ చేస్తున్నాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

మొత్తానికి బండ్ల గణేష్ మరియు ఆ గురూజీ ( Guruji )వ్యవహారం సోషల్ మీడియా లో హార్ట్ టాపిక్ గా మారింది.ముందు ముందు ఈ టాపిక్ ఎంత దూరం వెళ్తుందో అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఒక సినిమా సమయం లో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు మధ్య దూరం చాలా పెరిగింది.
దాంతో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ దూరంగా ఉండాల్సి వస్తుంది.ఒకప్పుడు బండ్ల గణేష్ అనగానే పవన్ కళ్యాణ్ అభిమాని అనే పేరు వచ్చింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
దానికి కారణం గురూజీ అంటూ బండ్ల గణేష్ ఆరోపిస్తున్నాడు.మొత్తానికి ఈ వ్యవహారం లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరు బండ్ల గణేష్ కి మరి కొందరు గురూజీ కి మద్దతుగా నిలుస్తున్నారు.
మరో వైపు నిర్మాతగా బండ్ల బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ వివాదం కారణంగా ఆయన నిర్మాతగా సినిమా లు చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
