బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సింగిల్ బెంచ్ విచారణ చేసింది.
ఇందులో భాగంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.