వ్యూహాత్మక ఎత్తుగడ వేసిన బండి సంజయ్...ఫలించేనా?

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తనదైన కీలక పాత్ర పోషించేందుకు తమకున్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీని తెలంగాణలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలనే వ్యూహాన్ని చాలా బలంగా ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది.

అందుకు మరో వ్యూహాత్మక ఎత్తుగడను బండి సంజయ్ ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని నిలబెట్టాలంటే అంతేకాక అధికార పక్షాన్ని ఎదుర్కోవాలన్నా చాలా కష్టతరమైన విషయం.అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.

అయితే యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనంతో బీజేపీ మరింతగా బలపడేందుకు అవకాశం ఉందా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ బీజేపీలోకి ఆహ్వానించి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్న క్రమంలో యువ తెలంగాణ పార్టీ అస్త్రాన్ని టీఆర్ఎస్ తమ వ్యూహాల్ని మరల సమీక్షించుకునేలా పావులు కదుపుతున్నారు.

Advertisement

అయితే తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడిన జిట్టా బాలకృష్ణారెడ్డి తనకు తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో ఇక స్వాంతగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.అయితే యువ తెలంగాణ పర్టే విలీనం  వ్యూహాత్మక ఎత్తుగడతో ఒక్కసారిగా బీజేపీ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారుతున్న పరిస్థితి ఉంది.

అయితే యువ తెలంగాణ పార్టీ  విలీన వ్యూహం బీజేపీని మరింతగా బలపడేందుకు  దోహద పడుతుందా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పవచ్చు.ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నా టీఆర్ఎస్ గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

తాజా వార్తలు