తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా బండి సంజయ్ ఎంఐఎంపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో సంచలనం రేపాయి.
పాతబస్తీలో విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఓవైసీ రాజ్యం నడుస్తోందని బీజేపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం విద్యుత్ బకాయిలను కట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో రామ రాజ్యం వస్తుందని వ్యాఖ్యానించారు.అయితే టీఆర్ఎస్ అండ దండల వల్లే పాత బస్తీలో ఓవైసీ రాజ్యం నడుస్తోందని బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాత బస్తీ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించాయి.
అయితే పాత బస్తీలో బలం పెంచుకునేందుకే బండి సంజయ్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే వచ్చే ఎన్నికలలో పాతబస్తీ కూడా బీజేపీ ప్రధాన టార్గెట్ గా ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.అందుకే అక్కడ ఉన్న బీజేపీ నేతలను ఉత్సాహ పరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే ఒక ప్రచారం నడుస్తోంది.
ఏది ఏమైనా పాత బస్తీలో ఎంత మేరకు బీజేపీ తమ బలాన్ని పెంచుకుంటుందనే విషయాన్ని ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ కదలికల్ని బట్టి మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.