అమిత్ షాతో బండి సంజయ్, ఈటల భేటీ..!

తెలంగాణాలో రాజకీయ వేడి మళ్లీ మొదలైంది.ముఖ్యంగా హుజూరాబాద్ ఉపేన్నికల సందర్భంగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ పక్కా ప్లానింగ్ తో వెళ్తుందని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ అమిత్ షాతో సమావేశం కానున్నారు.

Bandi Sanjay Etala Rajendar Meeting With Amith Sha, Amith Sha, Amith Shah Meetin

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి సమావేశం జరుగనుంది.ఈ సందర్భంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరారు.

తెలంగాణాలో ప్రస్తుత రాజకీయ స్థితిగతుల పాటుగా హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులు ఎలా రెడీ అవుతున్నారన్న విషయంపై అమిత్ షాకు వీరు వివరిస్తారని తెలుస్తుంది.

Advertisement

ఢిల్లీ పర్యటన గురించి బండి సంజయ్ మాట్లాడుతూ అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తున్నామంబి అన్నారు.బండి సంజయ్, ఈటల రాజేందర్ అమిత్ షాతో పాల్గొనే సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

తెలంగాణాలో బీజేపీ పట్టు సాధించేందుకు హుజురాబాద్ ఉప ఎన్నికలు కూడా ఉపయోగపడనున్నాయి.దుబ్బాక ఫలితాన్నే అక్కడ కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు బీజేపీ నేతలు.

 త్వరలోనే హుజురాబాద్ లో మహా సభ ఏర్పాటు చేసే ఆలోచనల్లో ఉన్నారు బీజేపీ నేతలు.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు