Prasads Multiplex: అదేంటి.. ఇకపై సినిమాలకు రివ్యూలకు నో ఛాన్స్ .. ఎందుకో తెలుసా?

హైదరాబాదులో( Hyderabad ) సినిమా థియేటర్లకు కొదవే లేదు అని చెప్పవచ్చు.చిన్నచిన్న థియేటర్లో నుంచి లగ్జరీ థియేటర్ల వరకు ఉన్నాయి.

ఇక నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్ల విషయానికి వస్తే పివిఆర్, ఐనాక్స్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో( Prasads Multiplex ) ఆడియెన్స్ సినిమాలు వీక్షించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

నగరంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కు భారీగా క్రేజ్ ఉంది.నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఉండే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ గురించి తెలియని సినీ ప్రియులే ఉండరు.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో మూవీ రివ్యూలను( Movie Reviews ) నిషేధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళితే.మామూలుగా శుక్రవారం వచ్చింది అంతే చాలు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద కొత్త సినిమాలతో సందడి మామూలుగా ఉండదు.

ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలైతే ఆడియన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది.ఇక సినిమా రివ్యూల కోసం వచ్చే పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రాంగణంలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వారు ప్రేక్షకుల నుంచి తీసుకునే రివ్యూల విషయంలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఈ క్రమంలో ప్రేక్షకులు ఇచ్చే రివ్యూలతో పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాపై( Adipurush Movie ) ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో ఒక ప్రేక్షకుడు ఇచ్చిన రివ్యూతో ఆగ్రహం చెందిన ప్రభాస్ అభిమానులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో సినిమా రివ్యూలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.ఇకపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రాంగణంలో యూట్యూబ్ ఛానల్స్ కు అనుమతిని నిషేధిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.భవిష్యత్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు