Baltimore Bridge Tragedy : బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం .. అమెరికా కార్మిక శక్తిలో వలసదారుల పాత్రను హైలైట్ చేసిన ఘటన

అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను( Baltimore Bridge ) సరకు రవాణా నౌక (కార్గో షిప్ ) ఢీకొట్టడంతో బ్రిడ్జీ మొత్తం కుప్పకూలిన సంగతి తెలిసిందే.పటాప్‌స్కో నదిపై( Patapsco River ) వున్న ప్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సోమవారం అర్థరాత్రి దాటాక ఈ నౌక ఢీకొట్టింది.

 Baltimore Bridge Highlights Role Of Migrants In Us Workforce-TeluguStop.com

ప్రమాద తీవ్రతకు సెకన్ల వ్యవధిలోనే వంతెన కుప్పకూలగా .ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి.బ్రిడ్జిపై గుంతలను సరిచేస్తున్న ఆరుగురు లాటినో ( Latino Workers ) కార్మికులు మరణించడం అమెరికాను నడిపించడంలో వలసదారులు పోషించే పాత్ర ఎలాంటిదో హైలైట్ చేసింది.ఇది డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు చేస్తున్న ప్రచారానికి పూర్తి విరుద్ధంగా వుంది.

దేశాన్ని నాశనం చేసే నేరపూరిత ఆక్రమణదారులుగా వలస కార్మికులను వారు చిత్రీకరించారు.

వలసదారులు( Migrants ) అమెరికన్లు చేయని, చేయలేని ఉద్యోగాలను చేస్తున్నారని ఉద్యమ నేత, మాజీ నిర్మాణ కార్మికుడు లూయిస్ వేగా( Luis Vega ) పేర్కొన్నారు.

పని చేయడం చాలా కష్టమని.ప్రమాదకర పరిస్ధితుల్లో ఎక్కువ గంటలు పని చేయాల్సి వుంటుందని ఆయన చెప్పారు.

ఇక్కడ (అమెరికాలో) హోటల్‌ను ఎవరు శుభ్రం చేయాలనుకుంటున్నారు.? నిప్పులుకక్కే ఎండలో ఎవరు పని చేయాలనుకుంటున్నారు.? పొలాల్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అని వేగా ప్రశ్నించారు.

Telugu America, Donald Trump, Francisscott, Latino, Latinos, Luis Vega, Patapsco

ఓడ బ్రిడ్జిని ఢీకొట్టినప్పుడు ఘటనాస్థలంలో ఎనిమిది మంది వ్యక్తులు వుండగా .వారిలో ఇద్దరు రక్షించబడ్డారని , మిగిలిన వారి కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అయితే ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో పటాప్‌స్కో నది లోతు . గల్లంతైన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే వారు జీవించి వుండే అవకాశాలు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.బాధితులంతా మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్‌లకు చెందినవారే.

Telugu America, Donald Trump, Francisscott, Latino, Latinos, Luis Vega, Patapsco

ట్రంప్,( Trump ) జో బైడెన్‌లు( Joe Biden ) ఈ ఏడాది నవంబర్‌లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దేశంలో వున్న లాటినోలు రాజకీయ తరగతిలోని వర్గాల నుంచి తాము దాడికి గురవుతున్నట్లు భావిస్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది.ట్రంప్ కఠినమైన వలసవాద వ్యతిరేక ప్రచారాన్ని పరిశీలిస్తే.ఆయన గనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే నేరాలు, మాదకద్రవ్యాల వినియోగానికి కారణమయ్యే వ్యక్తులను సామూహికంగా బహిష్కరించే సూచనలు వున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube