Leopard Crocodile Hyenas Fight : చిరుత, హైనాలు, మొసళ్ల మధ్య థ్రిల్లింగ్ ఫైట్‌.. వీడియో చూస్తే గుండెల్లో గుబులు!

అడవుల్లో రోజూ జంతువుల మధ్య భీకరమైన ఫైట్లు, యుద్ధాలు జరుగుతుంటాయి.సినిమా సీన్లకు ఏ మాత్రం తీసిపోని థ్రిల్లింగ్ ఫైట్స్ చోటు చేసుకుంటాయి.కానీ ఇవి కెమెరాలకు చిక్కడం చాలా అరుదు.లక్ ఉంటే కొందరికి ఈ అద్భుతమైన పోరాటాలు చూసే ఛాన్స్ దొరుకుతుంది.తాజాగా అలాంటి అదృష్టం ట్రావిస్ కరీరా అనే ఐటీ కన్సల్టెంట్‌కు లభించింది.ట్రావిస్ ఇటీవల దక్షిణాఫ్రికాలోని మార్లోత్ పార్క్‌కు వెళ్లాడు, అక్కడ అద్భుతమైన వన్యప్రాణుల పోరాటం చూశాడు.

 Impala Battles Leopard Crocodiles And Hyenas-TeluguStop.com

ఒక సాయంత్రం, అతను, అతని స్నేహితులు కలిసి పార్క్‌లోని ఒక చిరుతపులి వేటాడటానికి ప్రయత్నిస్తున్నట్లు చూశారు, కానీ అది ఏమీ పట్టుకోలేకపోయింది.సూర్యాస్తమయం సమయంలో, కొన్ని ఇంపాలాలు (జింకల రకం) హైనాల సమూహానికి దగ్గరగా వెళ్ళడం చూశారు.

ఏదో ఉత్తేజకరమైన ఛేజింగ్ జరగబోతోందని వారు అనుకున్నారు.ట్రావిస్ తన కెమెరాతో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.

ఇంతలోనే చిరుతపులి ఒక ఇంపాలాను పట్టుకోగలిగింది, అయితే హైనాలు దానిని దొంగిలించడానికి ప్రయత్నించాయి.ఓ హైనా జింకను చిరుతపులి( Leopard ) దగ్గర నుంచి జింకను కొట్టేసింది.

దాంతో చిరుత దాని వెంట పరుగెత్తింది, కానీ మరిన్ని హైనాలు, రెండు పెద్ద మొసళ్లు ఇంపాలా కోసం ముందుకు వచ్చాయి.చివరికి ఓ హైనా ఇంపాలాను దొంగలించి కొండపైకి లాకెళ్ళింది.

అప్పటికీ అది ఇంకా బతికే ఉందని ట్రావిస్ చెప్పాడు.హైనా( Hyena ) దానిని గట్టిగా పట్టుకుంది, అప్పుడు నదిలోంచి రెండు పెద్ద మొసళ్లు బయటికి వచ్చి హైనా నుంచి ఇంపాలాను లాక్కుని దాని జీవితాన్ని ముగించాయి.చిరుత వెనక్కి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించినా కుదరలేదు.ఈ పోరాటం మరొక పెద్ద హైనాను ఆకర్షించింది, అది ధైర్యంగా మొసళ్లతో పోరాటానికి దిగింది.మొదటి హైనా కూడా ఈ పోరాటంలో చేరింది.చివరికి, మొసళ్లు( Crocodiles ) ఎక్కువ భాగం తినేసాయి.

హైనాలకు చాలా తక్కువ మాంసం మాత్రమే మిగిలింది.ఈ వీడియోను చూసిన వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి ఇంపాలా ఈ పోరాటంలో బహుమతి మాత్రమే అని అన్నారు.ఈ వీడియో చూస్తుంటే అడవి ఇంత క్రూరంగా ఉంటుందా అనే భయం కలుగుతుందని మరొకరు అన్నారు.

మొసళ్లు చాలా నమ్మకంగా కనిపిస్తున్నాయని మరొక కామెంట్ చేశారు.ఆఫ్రికాలో ఇలాంటి క్రూరమైన యుద్ధాలు జరుగుతున్నాయని మరొకరు అభిప్రాయపడ్డారు.

మొసలి కనిపించినప్పుడు అన్ని జంతువులు వెనక్కి తగ్గాయని ఒక యూజర్ పేర్కొన్నారు.ఈ వీడియో ప్రకృతిలో క్రూరమైన జీవన వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.చిరుత, హైనాలు, మొసళ్ళు ఒకే ఒక ఇంపాలా కోసం ఇంత భయంకరమైన పోరాటం చేయడం చూసిన ప్రతి ఒక్కరిలో భిన్నమైన భావోద్వేగాలు రేకెత్తాయి.ఈ అద్భుతమైన పోరాటానికి సంబంధించిన వీడియోను లేటెస్ట్ సైటింగ్స్( Latest Settings ) అనే యూట్యూబ్ ఛానెల్‌ షేర్ చేసింది.

ఈ వీడియో బాగా పాపులర్ అయి 10 లక్షల దాక వ్యూస్ సాధించింది.ఇందులో చిరుతపులి, హైనాలు, మొసళ్ల మధ్య జరిగిన భయంకరమైన పోరాటం చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube