ఆరేళ్లుగా తలస్నానం బంద్.. ఎందుకో తెలుసా?

యువతను బాధించే అతి పెద్ద సమస్యల్లో జుట్టు రాలిపోవడం ప్రధానమైంది.ఒక్కసారి జుట్టు రాలటం స్టార్ట్ అయితే.

 Balding Man Stops Washing His Hair For Six Years Details, Viral Latest, Viral Ne-TeluguStop.com

ఇక దాన్ని ఆపడం కష్టమనే అభిప్రాయం యువతలో ఉంది.పాతికేళ్లు వచ్చే సరికే జుట్టు పలచబడి మాడు కనిపిస్తోంది.

ఉద్యోగం ఉన్నా.నెత్తిన వెంట్రుకలు లేకపోవడం వల్ల పెళ్లి కుదరని సాఫ్ట్‌వేర్ బ్రహ్మచారులెందరో.

కొంత మంది జుట్టు విషయంలో చాల జాగ్రత్తగా ఉంటారు.ఎలా ఉన్న రాలే జుట్టు రాలుతుంది.

కాలుష్యం వలన, పోష‌కాహార లోపం వలన, జంక్‌ఫుడ్‌, కెమిక‌ల్ షాంపూలు వాడ‌డంతో చాలామందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు ఊడిపోతున్న‌ది.అందుకే హెయిర్ కోసం ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతుంటారు.

కొందరు జుట్టు ఊడిపోతుందేమో అనే భయంతో కనీసం హెల్మెట్ ధరించడానికి కూడా ఇష్టపడరు.కొంతమంది కర్చీఫ్ తలకు కట్టుకుని దానిపైన హెల్మెట్ ధరిస్తారు.

ఇదే స‌మ‌స్య నిక్ కోయెట్టీ అనే ఓ వ్యక్తికి వ‌చ్చింది.నిక్ చిన్నతనంలోనే హెయిర్ ఊడడం మొదలయింది.

హెయిర్ ఊడి తను ధరించిన షర్ట్ పై పాడేది.

నిక్.

ఇవ్వన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చానని తెలిపాడు.గత ఐదేళ్లులో ఒక్కసారి కూడా సాంపూతో తలస్నానం చేయలేదన్నాడు.

సాంపూలు వాడితే తలకు రసాయనాలు చేరుతాయనే ఉద్దేశ్యంతో సాంపూ వాడలేదన్నారు.ప్రస్తుతం తన వెంట్రుకలు బలంగా ఉన్నాయని… జుట్టు ఊడడం లేదని తెలిపాడు.త‌ల‌స్నానం చేయ‌కుంటే ఓ రెండు వారాల‌పాటు మురికిగా అనిపిస్తుంద‌ని, ఆ త‌ర్వాత త‌ల‌లో స‌హ‌జ‌నూనెలు ఉత్ప‌త్తి అవుతాయ‌ని, వాటిక‌వే ఫ్రెష్‌గా మారిపోతాయ‌ని నిక్ అంటున్నాడు.మ‌నం త‌ల‌స్నానం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని నిక్ చెబుతున్నాడు.

దీన్ని వీడియో ద్వారా తెలిపారు నిక్.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube