నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.
సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్య తన తర్వాత సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్టార్ట్ చేసాడు.బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమా నుండి బాలయ్య లుక్ కు సంబందించిన ఏదొక ఫోటో రివీల్ అవుతూనే ఉంది.బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించ బోతున్నట్టు తెలుస్తుంది.
మరి ఈ గెటప్స్ రివీల్ అవ్వగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా రివీల్ అయినా ఈయన కొత్త లుక్ చూసి అందరు నోరెళ్లబెడుతున్నారు.
ఈయన తాజాగా విమానాశ్రయంలో కెమెరా కంట పడ్డారు.ఒక్కసారిగా పదిహేను ఇరవై ఏళ్ల వయసు తక్కువగా అయ్యాడా అని అంతా ఫీల్ అవుతున్నారు.ఈయన లుక్ కు సంబందించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఫ్యాన్స్ సైతం ఈయనను ఇలా ఎప్పుడు చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా బాలయ్య తన కొత్త లుక్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసారు.
ఇక బాలయ్య 107వ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజా షెడ్యూల్ టర్కీలో ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల అక్కడ క్యాన్సిల్ చేసి కర్నూల్ లో ప్రెసెంట్ షూటింగ్ జరుపు కుంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.
కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.