నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి‘.మరొక 15 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
దీంతో ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగకు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం రెడీ అయినట్టు తెలుస్తుంది.”వీరసింహారెడ్డి” ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి ఫస్ట్ వీక్ నుండి బాలయ్య వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన బోతున్నాడు అని తెలుస్తుంది.
అంతేకాదు మేకర్స్ పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారట.ఇందులో భాగంగానే ఏపీ లోని పలు నగరాల్లో టీమ్ విజిట్ చేస్తుంది అని తెలుస్తుంది.మొత్తానికి బాలయ్య ఈసారి ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇదే సీజన్ లో బాలయ్యకు పోటీగా మెగాస్టార్ కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో రాబోతున్నాడు.ఒకరోజు గ్యాప్ తోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఇందులో విశేషం ఏంటంటే మెగాస్టార్ సినిమాలో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.
మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.మరి సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.







