ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ( TDP ) సత్తా చాటుతోంది.ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది.
ఇదే సమయంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది.దీంతో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది.
పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే దిశగా రాణించటంతో ఎమ్మెల్యే బాలకృష్ణ( Balakrishna ) స్పందించారు.

వై నాట్ 175 అని జగన్ ( JAGAN ) ఇప్పుడంటే వినాలని ఉందని సెటైర్లు వేశారు.జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీని( YCP ) తొక్కిపట్టి నార తీశారని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయని త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుతాయని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బాలకృష్ణ అభినందనలు తెలియజేశారు.సీఎం సొంత జిల్లా కడపలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడటంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.







