నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటిటి లో అడుగు పెట్టనున్న విషయం విదితమే.తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’ లో బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్న విషయం అందరికి తెలుసు.‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతొ నవంబర్ 4 నుండి ఆహాలో బాలయ్య టాక్ షో మొదలు కాబోతుంది.ఈ టాక్ షోలో పాల్గొనేందుకు ఇండస్ట్రీ నుండి పలువురు సెలెబ్రిటీలు అతిధులుగా రాబోతున్నారన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే బాలయ్య అదిరిపోయే ప్రోమోతో ఎంట్రీ ఇచ్చి ఈ షో పై మరింత ఆసక్తిని పెంచేసాడు.ఈ షోకి మంచు మోహన్ బాబు మొదటి గెస్ట్ గా వచ్చారు.
ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోకు రావడంతో పాటు వీరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగినట్టు ప్రోమో చూస్తేనే అర్ధం అవుతుంది.అంతేకాదు మోహన్ బాబు, బాలయ్య మధ్య పొలిటికల్ సంభాషణ కూడా వచ్చినట్టు తెలుస్తుంది.
వీరిద్దరూ ఇప్పటికే వేరు వేరు పార్టీల్లో ఉండడంతో ఈ పొలిటికల్ సంబాషణ ఆసక్తి రేపుతోంది.మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు ఎందుకు తీసుకోలేదు చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు అని బాలయ్యను ప్రశ్నించారు? ఈ ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటి వరకు ఇలాంటి ప్రశ్నకు బాలయ్య సంమాధానం చెప్పక పోవడంతో ఈ ప్రశ్నకు బాలయ్య ఏం సమాధానం చెప్పి ఉంటాడా అని అందరు వెయిట్ చేస్తున్నాడు.
ఇక బాలయ్య కూడా మోహన్ బాబు ను ప్రాణ సమానమైన అన్నగారి పార్టీని మీరు ఎందుకు వదిలేసారు? అనే ప్రశ్న వేశారు.ఎవరో ఫిట్టింగులు పెడుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.దీంతో ఫిట్టింగులు ఎవరు పెట్టి ఉంటారు.
అనే ప్రశ్న అందరు వేసుకుంటున్నారు.అయితే వీరి సంభాషణ మొత్తం తెలియాలంటే మొత్తం షో చూడాల్సిందే.