ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా పెను మార్పులు వచ్చాయి.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది.
తెలుగుదేశం పార్టీ అధినేత జైలు పాలు కావడంతో నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు.దీంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు.చంద్రబాబు నాయుడు అరెస్టు కేవలం కక్ష సాధింపు చర్య అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) అరెస్టు విషయంపై స్పందించలేదు అంటూ పలువురు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడ్డారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను అవమానించినప్పుడు మీరంతా ఎందుకు మాట్లాడలేదు స్పందించడం స్పందించకపోవడం అది పూర్తిగా ఎన్టీఆర్ ఇష్టం అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.అయితే గతంలో బాలకృష్ణ</em(Balakrishna) చిన్నల్లుడు భరత్(Bharath) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి( TDP ) వస్తే పార్టీకి లాభం కలుగుతుందా లేక నష్టమా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు భరత్ సమాధానం చెబుతూ ఎన్టీఆర్ పార్టీలోకి రావడం వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు అంటూ కామెంట్ చేశారు.ఇలా ఈయన ఎన్టీఆర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య చిన్నల్లుడు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
అయితే ఈ విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భరత్ ఆరోజు నేను అన్నది తప్పు కాదు కానీ నేను చెప్పిన విధానం తప్పుగా ఉందని అందుకే అందరూ అపార్థం చేసుకున్నారని ఈయన తెలియజేశారు.ఒక పార్టీ బలపడాలి అంటే ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు అందరూ కలిస్తేనే పార్టీ బలపడుతుందన్న ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేశానని అంతకుమించి ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను అనలేదు అంటూ భరత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి