2023 సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదనే సంగతి తెలిసిందే.మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న వీరసింహారెడ్డి సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండగా ఎర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం లేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
సంక్రాంతి పోటీ గురించి బాలయ్య స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఉదయభానుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కావడం చరిత్రలోనే తొలిసారి అని బాలకృష్ణ కామెంట్లు చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు ఈ విధంగా ఒక రికార్డ్ దక్కిందని బాలయ్య చెప్పుకొచ్చారు.నిర్మాతలు మాట్లాడుతూ డైరెక్టర్ల మధ్య, హీరోల మధ్య హెల్తీ వాతావరణం ఉందని కామెంట్లు చేశారు.

రెండు సినిమాల ఫలితాల విషయంలో మాకు నమ్మకం ఉందని ఆ రీజన్ వల్లే ఒక్కరోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.బాలయ్య మాట్లాడుతూ పోటీ లేకుండా ఏ రంగంలో మజా ఉండదనే అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు.పోటీ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య వెల్లడించారు.

పోటీ ఉంటే మాత్రమే సినిమాలు మంచి ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని బాలయ్య చెప్పుకొచ్చారు.బాలయ్య అఖండ మ్యాజిక్ ను ఈ సినిమాతో రిపీట్ చేయాలని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరికొన్ని గంటల్లో వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ ఫలితం తేలిపోనుందనే సంగతి తెలిసిందే.







