మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి షాకిచ్చిన బాలయ్య.. ఒక్కరాత్రి అంటూనే అలా చెప్పడంతో?

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా అభిమానులకు బాలయ్య మరో షాకిచ్చారు.ఇప్పటికే మోక్షజ్ఞ( Mokshagna ) సినీ ఎంట్రీ ఆలస్యమవుతోందని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ లేనట్టేనని ఆయన చెప్పుకొచ్చారు.

 Balakrishna Shocking Comments About Mokshagna Cine Entry Details, Mokshagna, Bal-TeluguStop.com

భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ఎవరు డైరెక్టర్ అనే ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదని అన్నారు.

గతంలో ఆదిత్య 999 మ్యాక్స్ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అని చెప్పిన బాలయ్య ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విషయంలో నేను మెంటల్లీ అలా ప్రిపేర్ అవ్వనని పేర్కొన్నారు.

నేను ఏవీ ప్లాన్ చేయనని రేపు షూటింగ్ అంటే ఈరోజు కథ సిద్ధమవుతుందని బాలయ్య( Balakrishna ) చెప్పుకొచ్చారు.నాకు కథ సిద్ధం చెయ్యడానికి ఒక్క రాత్రి చాలని నేను అంత స్పీడ్ గా ఉంటానని నా స్పీడ్ ఎవరూ తట్టుకోలేరని బాలయ్య తెలిపారు.

Telugu Aditya Max, Balakrishna, Mokshagna, Mokshagna Cine, Nandamuri Fans-Movie

మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి నాకు అస్సలు దిగులు లేదని నా దగ్గరే బోలెడు సబ్జెక్టులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నాదే కావచ్చని లేదా రెండో మూవీ నాది కావచ్చని బాలయ్య చెప్పుకొచ్చారు.ఆదిత్య 999 మ్యాక్స్( Aditya 999 Max ) మాత్రం సిద్ధంగా ఉందని ఒక్కరాత్రిలో ఆ కథ సిద్ధం చేశానని కథ ఆసువుగా వచ్చేసిందని బాలయ్య కామెంట్లు చేశారు.ఈ విధంగా నా దగ్గర మరో 5 కథలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Telugu Aditya Max, Balakrishna, Mokshagna, Mokshagna Cine, Nandamuri Fans-Movie

మంచి దర్శకుడు దొరకాలని మాత్రమే కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకనుంది.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మోక్షజ్ఞను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా 2024లో అయినా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube