స్టార్ హీరో బాలయ్య ఈ మధ్య కాలంలో అభిమానులను మెప్పించే సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి సక్సెస్ సాధించగా మరో 2 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రం వీరసింహారెడ్డి మూవీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అవుతుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నాన్నగారిపై ఉన్న భయం వల్లే ఒక సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.

శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో నాన్నగారి మీద భయంతో చేశానని బాలయ్య కామెంట్లు చేశారు.నాన్నగారు సెలవు పెట్టమని అడిగితే సెలవు పెట్టి షూటింగ్ లో పాల్గొనేవాడినని బాలయ్య చెప్పుకొచ్చారు.ఏ ప్రాపర్టీ ఇచ్చినా దానిని ఎలా వాడుకోవాలో నాన్న నుంచి నేర్చుకోవాలని ఆయన తెలిపారు.
లెజెండ్ సినిమాలో గుర్రంతో గ్లాస్ బ్రేక్ చేసే సీన్ సొంతంగా చేశానని బాలయ్య తెలిపారు.

బోయపాటి శ్రీను గ్రాఫిక్స్ లో చేద్దామని చెప్పినా నేను వినకుండా చేశానని ఆయన కామెంట్లు చేశారు.నా సినిమాల టైటిల్స్ నా నేచర్ కు అనుగుణంగా ఉంటాయని బాలయ్య చెప్పుకొచ్చారు.నా సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చాలని భావిస్తానని ఆయన తెలిపారు.
నా సినిమాలలో మెసేజ్ కూడా ఉండాలని నేను కోరుకుంటానని బాలయ్య చెప్పుకొచ్చారు.కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయని బాలకృష్ణ వెల్లడించారు.
వీరసింహారెడ్డి సినిమా ఇప్పటివరకు 72 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.బాలయ్య సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.బాలయ్య ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని ఫ్యాన్ బాయ్ గా బాలయ్యను ఏ విధంగా చూపించాలో అదే విధంగా చూపించారు.







