చొక్కా విప్పుతున్న బాలయ్య.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్

నందమూరి బాలయ్య నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయ్యింది.

కాగా ఈ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్‌కు మరోసారి అదిరిపోయే ట్రీట్ రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాలో బాలయ్య మాస్ రూపం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్‌లో అలరించనుందని తెలుస్తోంది.

Balakrishna Ruler Movie-చొక్కా విప్పుతున్న �

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నాడు.

అయితే ఇందులో బాలయ్య ఓ పాత్రలో తన చొక్కా విప్పి కనిపిస్తాడని తెలుస్తోంది.ఈ పాత్రలో బాలయ్య మాస్ విశ్వరూపం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

బాలయ్య లాంటి సీనియర్ హీరో చొక్కా విప్పి నటించడం అంటే మాటలు కాదు.ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా తమ అభిమాన నటుడు చొక్కా విప్పడంతో నందమూరి అభిమానులు కాలర్ ఎగరేయనున్నారు.ఏదేమైనా ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలలో బాలయ్య బాబు తోపు అని వారు మరోసారి నొక్కి చెబుతున్నారు.

మరి బాలయ్య చొక్కా విప్పడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు సినీ వర్గాలు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!
Advertisement

తాజా వార్తలు