అఖండ'కు వీడ్కోలు.. సందడి చేసిన బోయపాటి, బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా అఖండ.

బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడం తో అభిమానులు ఈ హ్యాట్రిక్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా మే లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూట్ వాయిదా పడడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.

మళ్ళీ తిరిగి షూట్ జరుపుతుండ గా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ మళ్ళీ వాయిదా వేశారు.ఇక ఎట్టకేలకు ఇప్పటికి ఈ సినిమా షూట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

తాజాగా అఖండ సినిమాకు గుమ్మడి కాయ కొట్టి షూట్ ముగించినట్టు టాక్.

Advertisement

ఈ సినిమా షూట్ పూర్తి అవవడంతో వీడ్కోలు పార్టీ ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఈ వీడ్కోలు పార్టీలో డైరెక్టర్ బోయపాటి, హీరో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ అందరు ఫుల్ ఎంజాయ్ చేసినట్టు మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలు చూస్తేనే అర్ధం అవుతుంది.ఇక ఈ సినిమా షూట్ పూర్తి అవవడంతో ఈ సినిమాను దీపావళి బరిలోకి దింపే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక అఖండ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.ఒకటి అఘోరా పాత్ర అయితే మరొకటి కలెక్టర్ పాత్ర ఇంకొకటి ఫ్యాక్షనిస్ట్ అని టాక్.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండ గా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఏ క్షణంలో అయినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు