బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంత చేసుకుంటే ఆ విజయం కన్ఫర్మ్‌

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు.సినిమా విడుదల తేదీ విషయం లో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 Balakrishna Interesting Plans For His Next If Bhagavanth Kesari Movie Hit, Balak-TeluguStop.com

ఇదే సమయంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.అఖండ సినిమా తర్వాత వీర సింహా రెడ్డి సినిమా( Veera Simha Reddy movie ) తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

రెండు కూడా వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న విషయం తెల్సిందే.దాంతో భగవంత్ కేసరి సినిమా వంద కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Adithya, Balakrishna, Telugu-Movie

అదే జరిగితే సినిమా వసూళ్లు అంతకు మించి ఉండాలి.కనుక బాలయ్య( Balakrishna ) సినిమా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తున్నాయి.బాలయ్య ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.హీరోగా బాలయ్యకు ఆ సినిమా కూడా విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇదే సమయంలో బాలయ్య యొక్క తదుపరి సినిమా ల విషయం లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu Adithya, Balakrishna, Telugu-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ప్రస్తుతం చేస్తున్న భగవంత్ కేసరి సినిమా సక్సెస్ అయితే తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఆధిత్య 999 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.అందులో మోక్షజ్ఞ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.బాలయ్య స్వీయ దర్శకత్వం లో ఈ టైమ్ ట్రావెల్‌ సినిమా ను రూపొందించబోతున్నారు.

స్టోరీ లైన్ రెడీ గా ఉంది.అంతే కాకుండా బాలయ్య పాత్ర చాలా విభిన్నంగా రెండు విభిన్నమైన షేడ్స్ తో ఉంటుందట.

అంతే కాకుండా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కూడా ఇదే అవుతుందనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటే ప్రయోగం కి రెడీ అన్నట్లుగా ఉన్నాడు.

మరి భగవంత్ కేసరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube