తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో తనూశ్రీ దత్తా ఒకరు.ఈ హీరోయిన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
మీటూ ఉద్యమం సమయంలో సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా తనూ శ్రీ దత్తా పేరు వార్తల్లో నిలిచిందనే సంగతి తెలిసిందే.నానా పటేకర్ గురించి సంచలన ఆరోపణలు చేయడంతో ఈమె పేరు వార్తల్లో నిలిచింది.
తనూ శ్రీ దత్తా షాకింగ్ విషయాలను వెల్లడించిన తర్వాత పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.బాలయ్యతో కలిసి వీరభద్ర సినిమాలో నటించిన ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు.
తనుశ్రీ దత్తా ఆ పోస్ట్ లో నాకేం జరిగినా అందుకు నానా పటేకర్, అతని బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్స్ కారణమని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ మాఫియా అంటే ఎవరో కాదని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సమయంలో ఎవరి పేర్లు బయటికి వచ్చాయో వాళ్లు బాలీవుడ్ మాఫియా అని తనుశ్రీ దత్తా అన్నారు.బాలీవుడ్ మాఫియా జాబితాలో ఉన్నవాళ్ల సినిమాలు చూడవద్దని ఆ సినిమాలను పూర్తిగా బహిష్కరించాలని ఆమె కోరారు.ప్రతీకారంతో వాళ్లను వెంబడించాలని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు.
నా గురించి విషప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టవద్దని ఆమె అన్నారు.
ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల విషయంలో నమ్మకం ఉందని ఆమె కామెంట్లు చేశారు.
జై హింద్ బై మళ్లీ కలుద్దాం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.తనుశ్రీ దత్తా పోస్ట్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తనుశ్రీ దత్తా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.