తమన్ కి ఫిక్స్ అయిపోయిన బాలయ్య ఎందుకంటే..?

బాలయ్య బాబు( Balakrishna ) సినిమాలు అంటే మాస్ కి నచ్చె అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగా ఉండే విధం గా బాలయ్య చూసుకుంటారు అలా ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను( Music Directors ) పెట్టుకుంటారు ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో బాలయ్య అచి తుచి తీసుకుంటాడు…ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు ఎన్నో ఉన్నాయి.పలువురు దర్శకులు హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వరుసగా ఒకే సంగీత దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు.

 Balakrishna Giving Continuous Offers To Music Director Thaman Details, Thaman ,-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ని హీరోలు కూడా ఫాలో అవుతున్నారు.నటసింహ నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కి ( SS Thaman ) వరుస అవకాశాలు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Telugu Balakrishna, Bobby Kolly, Boyapati Srinu, Music Thaman, Thaman-Movie

ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు.‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘NBK 108’తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.అయితే బాలయ్య లేటెస్ట్ సక్సెస్ జర్నీలో తమన్ భాగమయ్యాడు.బాలయ్య-తమన్ మొదటిసారి 2016 లో విడుదలైన ‘డిక్టేటర్’ కోసం చేతులు కలిపారు.‘అఖండ’తో వీరిది సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకుంది.బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఆ తర్వాత వచ్చిన ‘వీరసింహారెడ్డి’తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాకి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు.దీని తర్వాత బాలయ్య చేయనున్న మరో సినిమాకి సైతం సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరించనున్నాడని సమాచారం.

 Balakrishna Giving Continuous Offers To Music Director Thaman Details, Thaman ,-TeluguStop.com
Telugu Balakrishna, Bobby Kolly, Boyapati Srinu, Music Thaman, Thaman-Movie

బాలయ్య తన 109 వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్ర ప్రకటన తొందర్లోనే రానుంది.ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా తమన్ పని చేయనున్నాడట.అంతేకాదు దీని తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త చిత్రానికి సైతం తమన్ సంగీతం అందిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మొత్తానికి బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫిక్స్ అనేలా పరిస్థితి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube