టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ చెంఘీజ్ ఖాన్ చరిత్రకు సంబంధించిన కథలో నటించాలని ఉందని తన మనస్సులోని అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.ఐదేళ్ల క్రితం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలకృష్ణ ఆ తరహా కథలలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే చెంఘీజ్ ఖాన్ గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంఘీజ్ ఖాన్ గురించి చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు తెలుసు.
ఇతని అసలు పేరు టెమూజిన్ కాగా ఈ వ్యక్తి ఒక సంచార జాతికి చెందినవారు.మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చెంఘీజ్ ఖాన్ తన సైన్యంతో ఇతర ప్రాంతాలపై దండయాత్రలకు వెళ్లేవారు.
ప్రజల విషయంలో చెంఘీజ్ ఖాన్ చాలా క్రూరంగా వ్యవహరించే వారు అని సమాచారం అందుతోంది.
పలు చారిత్రక రచనల ప్రకారం చెంఘీజ్ ఖాన్ మహిళల విషయంలో కూడా ఇష్టానుసారం ప్రవర్తించేవారట.
ఎంతోమంది రాజ్యాధినేతలు ఇతని సైన్యం చేష్టలను భరించలేక సామంతులుగా మారిపోయారట.రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర బాలయ్యకు బాగా సూట్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్రిష్, సంకల్ప్ మరి కొందరు టాలీవుడ్ దర్శకులు సైతం ఈ తరహా కథలను హ్యాండిల్ చేయగలరు.ఏ దర్శకుడు ఈ కథతో బాలయ్యను కలుస్తారో చూడాల్సి ఉంది.బాలయ్య మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
బాలయ్య వరుస సినిమాలతో బిజీ కావాలని భావిస్తుండటం గమనార్హం.బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.