టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలైన విషయం తెలిసిందే.కాగా ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ బాలకృష్ణ బావగారు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత ఆయన చంద్రబాబు నాయుడు ని ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలోనే కాసేపు సరదా సరదాగా ముచ్చటించి అనంతరం 1995లో జరిగిన రాజకీయ సంక్షోభం గురించి చర్చించారు.ఆ విషయంపై నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీరు తప్పు చేస్తున్నారు, అలా చేయవద్దని ఎన్టీఆర్ ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను.
ఆయన వినకపోతేనే మనం ఆయన్ని గద్దె దింపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.ఒక వ్యక్తిగా అడుగుతున్నా.మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ అన్ స్టాపబుల్ షోలో బాలయ్యను బాబు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.ఆ విషయంపై స్పందించిన బాలయ్య బాబు.
కాదు అన్నట్లు సైగ చేస్తూ ఆ రోజు నాకు ఇంకా గుర్తుకు వుంది అని తెలిపారు.అంటే ఎన్టీఆర్ ని దించి చంద్రబాబు సీఎం సీటులో కూర్చోబెట్టాలనే ప్రణాళికలో బాలయ్య హస్తం కూడా ఉందన్న మాట.బాలయ్యతో పాటుగా బాబు దీనికి ప్రణాళిక వేశాడు.కాగా ఈ షోలో బాబు స్పష్టంగా చెప్పారు.
అది మన నిర్ణయం అని.నా నిర్ణయం అనలేదు.ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టినా, చెప్పుల దాడి చేయించినా, పత్రికల్లో అసభ్యకర కార్టూన్స్ తో ఆయన పరువు తీసినా బాలయ్య ప్రమేయం కూడా ఉందని అలా మొత్తానికి బావ పై ఉన్న వెన్నుపోటు అపవాదు ఎలా పోగొట్టాలి అని అనుకోని బాధపడుతున్న బాలయ్యకు అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక అయ్యింది అని చెప్పవచ్చు.1995లో ఎన్టీఆర్ ని పదవికి దూరం చేయడం పార్టీ, ప్రజా సంక్షేమం కోసమే తప్ప, బాబుకి సీఎం అవ్వాలని ఏ కోశాన లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.మరి ఈ విషయంపై ఏ విధంగా ముగింపు పలికారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చూడాల్సిందే మరి.