వరుసగా 7 సినిమాలు ఫ్లాపైన సమయంలో బాలయ్య స్టార్ డైరెక్టర్ తో అలా అన్నారా?

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా, ఏ దర్శకుడికి అయినా సక్సెస్ కీలక పాత్ర పోషిస్తుంది.వరుస ఫ్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరం అయిన డైరెక్టర్లు ఎక్కువమందే ఉన్నారు.

 Balakrishna Comments About Continuous Flops Details, Balakrishna, Boyapati Srinu-TeluguStop.com

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.అయితే లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో ఢీలా పడిన హీరోలలో బాలకృష్ణ ఒకరు.

చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లకు బాలయ్య అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాలను డైరెక్టర్లు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.

బాలకృష్ణ విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండు రంగడు, మిత్రుడు సినిమాలతో వరుసగా ఫ్లాపులు చవిచూశారు.

ఈ సినిమాలలో కొన్ని సినిమాలు నిర్మాతలకు అంచనాలకు మించి నష్టాలు రావడానికి కారణమయ్యాయి.ఈ సినిమాల వల్ల ప్రేక్షకులలో బాలయ్యకు సైతం ఆ సమయంలో ఒకింత క్రేజ్ తగ్గింది.

వరుస ఫ్లాపులు బాలయ్య సినిమాల బిజినెస్ పై కూడా ప్రభావం చూపాయి.

అయితే వరుసగా ఏడు ఫ్లాపులు వచ్చిన సమయంలో ఒక డైరెక్టర్ కథ చెప్పడానికి వెళితే బాలయ్య ఒకింత ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.

Telugu Allari Pidugu, Balakrishna, Boyapati Shrinu, Flops, Mahaarathi, Mithrudu,

తాను దర్శకులను నమ్మి సినిమా ఆఫర్లు ఇస్తుంటే చాలామంది దర్శకులు తన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లేదని బాధ పడ్డారని సమాచారం.ఫ్లాపులు తన కెరీర్ పై ప్రభావం చూపినట్టు బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తొంది.అయితే ఆ తర్వాత సింహా సినిమాతో బాలయ్య సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

Telugu Allari Pidugu, Balakrishna, Boyapati Shrinu, Flops, Mahaarathi, Mithrudu,

గత పదేళ్లలో బాలయ్య నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు కూడా బాలయ్య అవకాశాలను ఇస్తుండగా ఈ సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube