బాలయ్య ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న దంచవే మేనత్త కూతురా పాట అక్కడే..!

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో కాజల్ హీరోయిన్ గా శ్రీ లీల ముఖ్య పాత్ర లో నటించిన భగవంత్ కేసరి సినిమా మొన్న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా మొదటి వారం రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దాంతో సినిమా లాంగ్ రన్‌ లో మరో రూ.50 కోట్ల ను వసూళ్లు చేసే విధంగా ప్రమోషన్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ మేకర్స్‌ ఆ దిశగా అడుగులు వేయడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.ఈ సినిమా లో దంచవే మేనత్త కూతురా పాటను రీమిక్స్ చేశారు అంటూ టాక్‌ వచ్చింది.

 Balakrishna Bhagavanth Kesari Movie New Song Danchave Menatha Kutura Not Adding-TeluguStop.com

యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయాన్ని దృవీకరించారు.

సినిమా విడుదల అయిన వారం రోజుల తర్వాత లేదంటే ఏదైనా ప్రత్యేక సందర్భం లో సినిమా లో ఆ పాట ను యాడ్‌ చేస్తాము అన్నారు.కానీ దంచవే మేనత్త కూతురు పాట( Danchave Menatha Kuthura Song ) ను యాడ్‌ చేయడం ద్వారా సినిమా యొక్క ఫ్లో మిస్‌ అవుతుంది అనే ఉద్దేశ్యం తో ఇప్పుడు ఆ పాట ను యాడ్‌ చేసే ఉద్దేశ్యం లేదు అంటూ తేల్చి పారేశారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసే సమయంలో సినిమా కు యాడ్‌ చేస్తారట.

అంతే కాకుండా వీడియో సాంగ్ ను యూట్యూబ్‌ ద్వారా కూడా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఒక మంచి పాటను అది కూడా రీమిక్స్ ను వెండి తెరపై చూసే అవకాశం లేకుండా పోయింది అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో దంచవే మేనత్త కూతుర పాట కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు తెగ వైరల్‌ అవుతున్నాయి.వాటిని చూసినప్పుడు సినిమా లో ఆ పాట ఉంటే బాగుండేది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube