నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే వసూళ్ల విషయం లో ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వసూళ్లు సాధ్యం అవ్వాలి అంటే మరో వారం రోజుల పాటు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది.ఇప్పటికే విడుదల అయ్యి వారం అయింది కనుక ముందు ముందు ఎలా వసూళ్లు ఉంటాయో అని అంతా భావిస్తున్నారు.
అయితే దసరా పండుగ తర్వాత రోజు వరకు కూడా జనాలు భక్తి శ్రద్దలతో భవానీ మాలలతో ఉన్నారు.

కనుక థియేటర్ల వైపు చూడలేదు.మొన్నటి నుంచి మళ్లీ వారు థియేటర్ల వైపుకు వస్తున్నారు.తాజాగా భగవంత్ కేసరి ఉత్తరాంధ్ర మరియు నైజాం ఏరియా కలెక్షన్స్ భారీగా పెరిగాయి.
దాంతో భగవంత్ కేసరి సినిమా వసూళ్లు( Bhagavanth Kesari Collections ) పుంజుకోవడం తో వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది అంటూ బాక్సాఫీస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బాలయ్య మరియు బాబీ సినిమా పై ఈ సినిమా కలెక్షన్స్ ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా వాదిస్తున్నారు.

కనుక ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందా అంటూ భావించిన బాలయ్య అభిమానులకు తాజాగా కలెక్షన్స్ పుంజుకోవడం ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య మరియు కాజల్( Kajal Agarwal ) జంటగా నటించిన భగవంత్ కేసరి సినిమా లో హాట్ బ్యూటీ శ్రీ లీల( Sreeleela ) కీలక పాత్ర లో నటించింది.ఆమె నటనకి మంచి గుర్తింపు మరియు గౌరవం లభించింది.ఆకట్టుకునే అందం తో పాటు మంచి నటన కనబర్చిన శ్రీ లీల సినిమా కు ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక బాలయ్య మరియు శ్రీ లీల కాంబో సన్నివేశాలకు జనాలు బ్రహ్మరథం పట్టారు.







