అప్పుడు వీరసింహారెడ్డి.. ఇప్పుడు భగవంత్ లాల్ కేసరి.. బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరినట్టేనా?

స్టార్ హీరో బాలయ్య ( Balakrishna )జాతకాలను, మూహూర్తాలను బాగా నమ్ముతారనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో బాలయ్య జాతకం కూడా మారిపోయింది.ఓటీటీ షోలు అయినా, టీవీ షోలు అయినా, రాజకీయాల్లో అయినా పాజిటివ్ గానే బాలయ్య వార్తల్లో నిలుస్తున్నారు.2024 ఎన్నికల్లో మరోమారు టీడీపీని అధికారంలోకి తీసుకొనిరావడానికి బాలయ్య తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Balakrishna Anil Combo Movie Powerful Update Details Here Goes Viral , Balakrish-TeluguStop.com

2024 ఎన్నికల సమయానికే లెజెండ్2( Legend 2 ) సినిమా విడుదలయ్యేలా బాలయ్య ప్లానింగ్ ఉండనుందని తెలుస్తోంది.లెజెండ్ ను మించిన పవర్ ఫుల్ డైలాగ్స్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని సమాచారం.

మరోవైపు బాలయ్య పుట్టినరోజు కానుకగా బాలకృష్ణ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwal, Legend, Sreeleela, T

అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని బోగట్టా. భగవంత్ లాల్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు కూడా ఇదేనని తెలుస్తోంది.కాజల్( Kajal Aggarwal ), శ్రీలీల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwal, Legend, Sreeleela, T

బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు.బాలయ్య అనిల్ కాంబో మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా స్పష్టత రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube