నందమూరి హీరోలు బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ( Balakrishna jr ntr )ల గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇద్దరి హీరోల మధ్య గ్యాప్ ఉంది అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
చాలా సందర్భాలలో బాలయ్య బాబు ఎన్టీఆర్ ప్రవర్తనను బట్టి చూస్తే అది నిజమనే అనిపిస్తుంది.మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.
ఇదే విషయంపై బాలయ్య బాబు స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అన్నట్టుగా సీరియస్ గా స్పందించారు.దీంతో బాలయ్య బాబు అలాగే ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉంది అన్న వార్తలు నిజమే అని టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ప్రేక్షకులు కూడా భావించారు.

అయితే నందమూరి అభిమానులు ఎప్పుడూ కూడా బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ( Balakrishna jr ntr )సినిమాలు పోటీ పడకూడదనే కోరుకుంటూ ఉంటారు.ఒకవేళ కనుక ఇద్దరు సినిమాలు పోటీ పడితే వాతావరణం మామూలుగా ఉండదు.ఇలా బాలయ్య బాబు బాలకృష్ణ తో పాటు వారి అభిమానులు కూడా కోరుకోరు.ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చి సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితిలే వస్తే ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పవచ్చు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది.బాలకృష్ణ తదుపరి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో దేవర సినిమాలో ( Devara movie )నటిస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమా నిర్మాణంలో హీరో కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు.
ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.బాలయ్య బాబు 109వ సినిమాను అదే సమయానికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
అయితే ప్రస్తుతం అనుకుంటున్న ప్లాన్ ప్రకారం అయితే 2024 మార్చి 29 బెస్ట్ డేట్ అనుకుంటున్నట్లు టాక్.అంటే దేవర కంటే ఒక వారం ముందుగానే థియేటర్లలో ఉంటుంది.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు పెద్ద చిక్కుకొచ్చి పడినట్లే అవుతుంది.







