తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మాస్ ఆఫ్ ద గాడ్ గా బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
బాలయ్య - బోయపాటి శీను దర్శకత్వంలో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కించిన సంగతి అందరికి విదితమే.ఆ సినిమాలన్నీ భారీ విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మరోమారు బోయపాటి( Boyapati Srinu ) దర్శకత్వంలో బాలయ్య హీరోగా నాలుగవ సినిమాగా అఖండ 2( Akhanda 2 ) రాబోతుంది.ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతోంది.
ఇకపోతే, నేడు (బుధవారం) బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.ముందుగా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, తేజస్విని కెమెరా ఆన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ పూజా కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య బాబు డైలాగు చెప్పి అందర్నీ ఆకట్టుకున్నాడు.
అఖండ 2 సినిమాలోని ఒక డైలాగును బాలయ్య బాబు చెప్పారు.అదేంటంటే."ఈ నేల అసురుడిది కాదు.
ఈశ్వరుడిది పరమేశ్వరుడిది.కాదని, తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం" అంటూ బాలయ్య ( Balakrishna )అదరగొట్టేశాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో థమన్ బీజీఎంలో డైలాగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారిగా ఊహకు అందడం లేదని అభిమానులు అంటున్నారు.ఇక అఖండ 2 సినిమా షూటింగ్ మొదలవ్వకముందుకే అభిమానులలో భారీ అంచనాలు మొదలయ్యాయి.అంతేకాకుండా, ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.బాలయ్యను ఉద్దేశిస్తూ అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హీరో ఖచ్చితంగా అవుతారని తెలిపారు.
ఇక ఈ సినిమాకు థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఇక ఈ సినిమాకు సి.రామప్రసాద్ కెమెరామెన్ గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేయబోతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy