మా ఎన్నికల గడువు దగ్గర పడింది.మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు.
ఇద్దరు కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రకాష్ రాజ్ పెద్దల వద్దకు వెళ్లకుండా సొంతంగా పోటీ చేసి గెలుస్తాను అంటున్నాడు.
మంచు విష్ణు మాత్రం ఇప్పటికే కృష్ణ మరియు కృష్ణం రాజుల వద్దకు వెళ్లాడు.తాజాగా నందమూరి బాలకృష్ణ ను కూడా కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు.
బాలయ్య తన పూర్తి మద్దతును ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.దాంతో మంచు విష్ణు గెలుపు ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
అయితే మంచు విష్ణు ఎవరి వద్దకు అయితే వెళ్లి కలిశాడో వారు వచ్చి ఓట్లు వేసే వారు కాదు.వారికి ఇండస్ట్రీలో మద్దతుగా ఉన్న వారు మాత్రమే ఓట్లు వేస్తారు.
అంటే వారి వల్ల ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మాత్రం స్పష్టత లేదు.

ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ వర్గం స్పస్టంగా మంచు ఫ్యామిలీ కి ఓటు వేయబోతున్నట్లుగా తేలిపోయింది.బాలయ్య దారిలోనే ఆయన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ వర్గాల వారు మంచు విష్ణు కు ఓటు వేస్తారు.ఇక చిరంజీవి దారి ఎటు అనేది స్పష్టత లేదు.
చిరంజీవి ఒక్క సారి సైగ చేస్తే కనీసం 50 నుండి 100 ఓట్ల వరకు ఆ అభ్యర్థికి పడుతాయి.ఎవరికి అయితే మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటుందో వారు గెలవడం నూటికి నూరు శాతం అనడంలో సందేహం లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన మాట ఒక వేద వాక్కు అన్నట్లుగా తీసుకునే వారు ఉన్నారు.అందుకే బాలయ్య తన స్టాండ్ ను ప్రకటించాడు కనుక చిరంజీవి కూడా ఆయన ఎటు వైపు అనే విషయాన్ని చెప్పాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు చాలా మంది మెగా సన్నిహితులు.కనుక చిరంజీవి సపోర్ట్ మాకే అన్నట్లుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు అంటున్నారు.మరి చిరు నోరు తెరిచి చెప్తాడా అనేది చూడాలి.