దిల్ రాజు( dil raju ) నిర్మించిన బలగం( balagam ) చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది.
ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సినిమా తెలంగాణ రాష్ట్రం లోని పలు పల్లెల్లో ఉచిత ప్రదర్శన చేస్తున్నారు.
దాంతో నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ ఎస్పీకి( Nizamabad SP ) ఫిర్యాదు చేయడం జరిగింది.వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని ఉచిత ప్రదర్శన ఆపేయాలని దిల్ రాజు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
పోలీస్ ఫిర్యాదు చేసిన కూడా తెలంగాణ పల్లెల్లో బలగం చిత్రం ఉచిత షో ఆగడం లేదు సోషల్ మీడియా లో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి.బలగం వంటి సినిమా ను ప్రతి గ్రామం లో స్వయంగా సర్పంచులు స్క్రీనింగ్ చేస్తున్నారు.
అందుకోసం వారు పెద్దగా అనుమతులు తీసుకోవడం లేదు.అయినా కూడా ఎంతో మంది సినిమా ని చూసేందుకు వస్తున్నారు.
ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.దిల్ రాజు ఎంత హెచ్చరించినా కూడా సర్పంచ్ మరియు ఇతర గ్రామస్తులు స్క్రీనింగ్ మాత్రం మానుకోవడం లేదు.ఈ విషయం లో దిల్ రాజు ఇంకా ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి.ముందు ముందు కచ్చితంగా ఈ విషయమై సీరియస్ గానే వ్యవహారం నడిచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ గ్రామస్తులు మరియు సర్పంచ్ లు మాత్రమే ఏం జరిగినా బలగం సినిమా ను స్క్రీనింగ్ చేసి తీరుతాం అంటున్నారు.మొత్తానికి బలగం వ్యవహారం ముందు ముందు సీరియస్ టర్న్ తీసుకుంటుందేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా కు వేణు దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.