వరంగల్‎లో బైరి నరేశ్ అరెస్ట్.. వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి తరలింపు

వరంగల్ జిల్లాలో బైరి నరేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇటీవల అయ్యప్పస్వామిపై నరేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు నరేశ్ ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో బైరి నరేశ్ ను వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి తరలించనున్నారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ నరేశ్ పై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలని అయ్యప్పస్వాములు డిమాండ్ చేస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు