అద్భుత ఆవిష్కరణ: డ్రైవర్‌ లేకుండానే నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్!

ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం ధరలు మండిపోతున్నాయి.అలాగే అధిక వాహనాల కారణంగా వాతావరణ కాలుష్యం కూడా మితిమీరి పెరిగిపోతుంది.

 Baidu Launched Autonomous Vehicle Without Steering Wheel Details, Driver, Helmet-TeluguStop.com

ఇక ఇండియా, చైనా లాంటి దేశాల పరిస్థితి వేరే చెప్పాల్సిన పనిలేదు.కేవలం వాయు కాలుష్యం వలెనే ఏటా కొన్ని వందలమంది చనిపోతున్నారంటే ఇక అర్ధం చేసుకోండి.

అందువలన ఫారిన్ దేశాలలో విద్యుత్ తో నడిచే వాహనాలు ఎక్కువగా నడుస్తున్నాయి.భారదేశంలో కూడా ఈ మధ్యనే ప్రజల ఆలోచనలు మారాయి.

మరీ ముఖ్యంగా కరోనా తరువాత పెట్రోల్, డీసెల్ వాహనాలనుండి, ఎలక్ట్రిక్ వాహనాలకు మారారు.

ఈ నేపథ్యంలోనే డ్రైవర్‌తో పనిలేని విద్యుత్‌ వాహనం ‘అపోలో ఆర్‌టీ6’ను చైనాకు చెందిన కృత్రిమ మేధ, సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ బైదూ ఆవిష్కరించింది.

బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ ఓ భాగం కానుంది.పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనమైన ఈ కారులో స్టీరింగ్‌ అయితే ఉంటుంది.కానీ అవసరం లేదనుకుంటే దాన్ని తీసేయవచ్చు.దీని ధర అక్షరాలా 250,000 యువాన్లు అంటే మన రూపాయలలో రూ.29 లక్షలు. స్టీరింగ్‌ లేకపోవడం వల్ల కలిసొచ్చే స్థలంలో అదనపు సీటు లేదా గేమింగ్‌ కన్సోల్‌, వెండింగ్‌ మెషీన్‌ వంటివి ఏర్పాటు చేసారు.

Telugu Apollo Rt, Vehicle, Baidu, Baidu Apollo Rt, Car Wheel, China, Electric Ca

ప్రస్తుతం టాక్సీలపై వెచ్చిస్తున్న వ్యయంలో సగానికే రోబోటాక్సీ వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు బైదూ వరల్డ్‌ వ్యవస్థాపకుడు, CEO రాబిన్‌ లీ అంటున్నారు.డ్రైవర్‌ లేకుండా దీనిలో ప్రయాణించవచ్చు.అయితే ప్రీలోడెడ్‌ మ్యాప్‌తో మాత్రమే ఇది పని చేస్తుంది.అంటే పరిమిత ప్రాంతాల్లో మాత్రమే దీనిలో ప్రయాణించగలము.లెవల్‌ 3లో అయితే జాతీయ రహదారులపై హ్యాండ్స్‌ ఫ్రీ డ్రైవింగ్‌కు అనుమతి ఉటుంది.బైదూ సంస్థ ఇప్పటికే, అపోలో గో అనే అటానమస్‌ టాక్సీ సర్వీసులను నిర్వహిస్తోందనే విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube