వైధ్య శాస్త్రం ఏ స్థాయిలో అభివృద్ది చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అద్బుతాలు ఆవిష్కరిస్తూ గుండెను తీసి కొత్త గుండెను పెట్టే స్థితికి మన వైధ్య శాస్త్రం వచ్చినందుకు ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం.
తాజాగా మరో అద్బుతం జరిగింది.వైధ్య శాస్త్రంలో కొత్త అధ్యయం మొదలైంది.
ఈ అద్బుతమైన సంఘటన నమ్మశక్యంగా కూడా లేదు అంటూ అంతా అంటున్నారు.పెద్ద ఎత్తున ఈ సంఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 26 ఏళ్ల ఒక మహిళ గర్బంతో ఉంది.గర్బంలో ఉన్న శిషువు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్కానింగ్ నిర్వహించారు.స్కానింగ్‌లో గర్బస్థ శిశువుకు స్పినా బిఫిడా అనే అరుదైన జబ్బు ఉందని తేలింది.దాంతో శిశువు వెన్నెముక సరిగా పని చేయదు.దాంతో పుట్టిన తర్వాత ఆ శిశువు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గర్భస్రావం చేయించాలని నిర్ణయించుకున్నారు.వారు 20 వారాల తర్వాత గర్బస్రావంకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలియడంతో ఒక ప్రముఖ హాస్పిటల్ వారి సమస్యకు పరిష్కారం చూపుతామంటూ ప్రకటించింది.

గర్బంలో ఉన్న శిశువుకు ఉన్న సమస్యను తాము తొలగిస్తామని, శిశువు బయటకు వచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉండేలా తాము చేస్తామంటూ హామీ ఇచ్చారు.హాస్పిటల్ వైధ్యులు హామీ ఇవ్వడంతో ఆ జంట గర్బస్రావంకు వెళ్లలేదు.వైధ్యులు ఆపరేషన్ చేసి 20 వారాల పిండను బయటకు తీసి, ఆ పిండంకు ఒక ఆపరేషన్ చేయడం వల్ల ఆ శిశువు సమస్యను తొలగించడం జరిగింది.ఆ శిశువుకు ఆపరేషన్ ముగిసిన తర్వాత మళ్లీ తల్లి గర్బంలోనే ఆ శిశువును ప్రవేశ పెట్టడం జరిగింది.

ఆ శిశువు తల్లి గర్బం నుండి బయటకు వచ్చి మళ్లీ లోనికి వెళ్లిన అరుదైన శిషువుగా గుర్తింపు దక్కించుకోబోతుంది.ప్రస్తుతం ఆ మహిళ మరియు మహిళ గర్బంలో ఉన్న శిశువు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు.ఇది వైధ్య శాస్త్రంలో అద్బుతంగా చెబుతున్నారు.పిండానికి ఏదైనా సమస్య ఉంటే అబార్షన్‌కు వెళ్లకుండా ఇది మంచి పద్దతి అంటూ వైధ్యులు చెబుతున్నారు.







