టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో మంచి జోష్ లో ఉన్నారు.ఇప్పటికే అన్ని జిల్లాలు చుట్టేసిన బాబు ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఎలక్షన్స్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఆ తప్పిదాలు ఇప్పుడు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
మహానాడు మొదలు పార్టీ కార్యకర్తల్లో కూడా జోష్ నింపుతూ గెలుపు కోసం పనిచేయాలని కోరారు.ఇక పార్టీ నేతలకు కూడా గట్టిగానే చెప్పారు.
అయితే ఈ సారి ఒంటరిగా కాకుండా పొత్తులు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే బీజేపీకి కూడా దగ్గరవుతున్నారు.
అయితే తెలంగాణలో ఓ జిల్లాపై బాబు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి మనుగడ లేకపోయినప్పటికీ ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కనీసం అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి తెలంగాణలో గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని స్థానాల్లోనైనా గెలవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏపీకి ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లా.
పైగా ఏపీ ప్రజలు కూడా ఉండటం కలిసి వస్తుందనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో అయితేనే కొన్ని సీట్లయినా గెలుపొందవచ్చనే నమ్మకంతో బాబు ఉన్నారు.

ఖమ్మం జిల్లాపై.
పైగా తెంలగాణలో గత ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి రెండు స్థానాలను టీడీపీ దక్కించుకుంది.ఆ తర్వాత వారిద్దరూ టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు.అయినా బాబుకు ఖమ్మం జిల్లాపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇక్కడ అయితేనే ఒకటి, రెండు స్థానాలు దక్కించుకోవచ్చని బలంగా నమ్ముతున్నారు.ఇక భద్రాచలం పర్యటనకు కూడా కొంత స్పందన రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యలోనే వచ్చే నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అది సక్సెస్ చేసుకుంటే తెలంగాణలో కొన్ని పార్టీలే తమ పార్టీతో పొత్తులకు ముందుకు వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు.

భారీ సభకు ప్లాన్…
అయితే తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరనే విషయం తెలిసిందే.బీజేపీతోనే ఆయన కలసి తెలంగాణలో వెళ్లాలని భావిస్తున్నారట.ఎలాగూ ఏపీలో కూడా బీజేపీతోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు.పైగా ఇప్పుడు ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచి పిలుపు రావడంతో ఆక్కడ ఏం మట్లాడతారోననే ఆస్తకి నెలకొంది.తెలంగాణలో మొదలు పెడితే ఏపీలో కూడా కంటిన్యూ అవుతుందని ఆయన భావిస్తున్నారు.
అందుకే ఖమ్మం సభకు తెలంగాణ నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేయనున్నట్లు సమాచారం.ఎలాగైనా సభను గ్రాండ్ సక్సెస్ చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి…
.