మధుమేహం అదుపులో ఉండాలంటే... ఎఫెక్టివ్ చిట్కాలు

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న,పెద్ద,ఆడ ,మగ అనే తేడా లేకుండ అందరు మధుమేహం బారిన పడుతున్నారు.

మారిన జీవనశైలి పరిస్థితులు,సరైన నిద్ర,లేకపోవటం,సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం మరియు పోషకాహార లోపం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి మన జీవనశైలిలో మార్పులు చేసుకొని ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని త్రాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.అంతే కాక ప్రతి రోజు పాలు త్రాగటం వలన ఎముకలు బలంగా ఉంటాయి.

ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో ఎముకలు బలహీనంగా మారతాయి.

Ayurveda Tips For Diabetes Control Diabetes, Diabetes Control, Healthy Tips,
Advertisement
Ayurveda Tips For Diabetes Control Diabetes, Diabetes Control, Healthy Tips,

రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని పోసి మరుసటి రోజు ఉదయం పరి గడుపున త్రాగితే మధుమేహం కంట్రోల్ అవుతుంది.ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు మంచి ఔషధంగా చెప్పుతారు.రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని వడకట్టి త్రాగాలి.

ఆ మెంతులను పేస్ట్ గా చేసుకొని కూడా తినవచ్చు.మెంతులు మధుమేహంను బాగా కంట్రోల్ చేస్తుంది.చేదు, వగరు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ తీపి పదార్ధాలను తక్కువగా తీసుకుంటూ ఉంటే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు