కోతులపై కోపం : వాటిని ఆ చట్టం నుంచి తప్పించండి

ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జనాలు కోతులపై విపరీతమైన కోపంతో ఉన్నారు.అంతే కాదు వాటిని నియంత్రించడంలో విఫలమవుతున్న అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపైనా వారు మండిపడుతున్నారు.

రోజురోజుకి వీటి సంతతి పెరిగిపోతుండడంతో పాటు ….వీటి ఆగడాలు శృతిమించడం వీరి ఆగ్రహానికి కారణం.

తాజాగా… ఆగ్రాలో ఒక కోతి 12 రోజుల పసికందుపై దాడిచేసి చంపేసిన నేపధ్యంలో పలువురు సామాజిక కార్యకర్తలు కోతులను వన్యప్రాణుల చట్టం కింద పేర్కొన్న రక్షిత జాతుల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కోతుల వలన పొంచివున్న ప్రమాదాలపై చర్చించేందుకు ఆగ్రాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సంఘసేవకుడు ముఖేష్ జైన్ మాట్లాడుతూ ఒక దశాబ్ధకాలంగా తాము కోతులను అడవులలో విడిచిపెట్టాలని, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.అయినప్పటికీ తమ గోడు ఎవరూ వినిపించుకోవడంలేదని వాపోయారు.

ఆగ్రా మున్సిపాలిటీ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో కోతుల సంఖ్య 25 వేల వరకూ ఉందని అన్నారు.అలాగే కోతుల బారిన పడినవారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు.తాజాగా ఒక కోతి చిన్నారిని చిదిమేసిన ఉదంత స్థానికులకు భయాందోళనలకు గురిచేస్తోందని అన్నారు.

అందుకే ప్రభుత్వం తక్షణమే కోతుల బెడద నుంచి తమను కాపాడాలని వారు వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube