తరచుగా చాలా మంది ఇళ్లలో పాములు( Snakes ) చొరబడుతూ ఉంటాయి.ఆ పాములు పట్టుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతారు.
ఒకవేళ ఆ పాము దొరకకపోతే ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి కాటేస్తుందో అని భయంతో బతుకుతూ ఉంటారు.కానీ ఇంటి ఆవరణలోకి లేదా పెరట్లోకి ఇలాంటి మొక్కలు( Plants ) పెంచితే పాములు ఇంటి వైపు కూడా అస్సలు రావు.
అయితే ఈ విషయాన్ని స్నేక్స్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు.అయితే పాములకు హాని చేయకుండా, అసలు పాములను ఇంటి వైపు రాకుండా చేయడానికి ఈ మొక్కలను పెంచడం మంచిది.
ఇంతకీ ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.తులసి మొక్క( Tulsi Plant ) అత్యంత పవిత్రమైన మొక్క అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే తులసి మొక్కను పూజిస్తే సకల శుభాలు లభిస్తాయి.

అంతేకాకుండా చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే.తులసి పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో ఉంటే వాటి నుండి వెలవడే ఒక రకమైన ఘాటు వాసనకు పాములు ఇంటి వైపుకు రావు అలాగే బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి మొక్కలకు కూడా పాములు దూరంగా ఉంటాయి.బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కల ఆకులు కాడలకు ముండ్లు ఉండడం వలన అవి తమకు హాని కలిగిస్తాయని భయంతో పాములు దూరంగా ఉంటాయి.
హాల్లి ట్రీ( Holly Tree ) మొక్కల ఆకుల అంచులు కూడా ముండ్ల ఆకారంలో ఉండడం వలన ఆ చెట్ల వద్దకు కూడా పాములు హాని కలిగిస్తాయేమో అని దూరంగా ఉంటాయి.ఇక చాలామందికి గోధుమ గడ్డి పై( Wheat Grass ) ఇప్పుడు చాలా అవగాహన ఏర్పడింది.
అయితే గోధుమ గడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే చాలామందికి తెలియనిది ఏంటంటే ఇది పాములను దూరం పెట్టే స్నేక్ రిప్లాంట్ గా( Snake Repellant ) పనిచేస్తుంది.గోధుమ గడ్డి నుండి వెలువడే ఒక రకమైన ఆమ్లాల వాసన పాములను ఆ ప్రదేశంలోకి రానివ్వకుండా చేస్తాయి.అలాగే బంతిపూల మొక్కల( Marigold ) నుండి ఒక రకమైన గాఢమైన ఘాటువాసన వెలువడుతుంది.
కాబట్టి ఆ వాసన వలన ఆ పాములు అటువైపుకు రావు.మాచిపత్రి మొక్కల ఆకుల నుండి కూడా ఘాటైన వాసన రావడంతో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా పాములు రావు.
ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా అవి వెదజల్లే ఘాటు వాసన వలన పాములు దూరంగా ఉంటాయి.ఎందుకంటే వీటిలో సెల్ఫోనిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది.
ఇది పాములను రాకుండా చేస్తుంది.