ఆస్ట్రేలియా: 107 రోజుల లాక్‌డౌన్‌ నుంచి విముక్తి.. కళకళలాడుతున్న సిడ్నీ రోడ్లు

కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

దాదాపు మూడు నెలల నుంచి వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని కీలక నగరాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది.

స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు లాక్‌‌డౌన్‌ ఎత్తివేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.తాజాగా సిడ్నీ టీకా టార్గెట్‌ను చేరుకోవడంతో దాదాపు 107 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన లాక్‌డౌన్‌ నుంచి సిడ్నీ వాసులకు సోమవారం విముక్తి కలిగింది.

ప్రభుత్వ నిర్ణయంతో పబ్‌లు, రెస్టారెంట్లు, దుకాణాలు సైతం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ప్రజలు రోడ్లపైకి రావడంతో సిడ్నీలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది.

అయితే కేవ‌లం రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారినే దుకాణాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లోని అనుమతిస్తున్నారు.న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో 70 శాతం జ‌నాభా వ్యాక్సినేట్ అయ్యారు.16 ఏళ్లు దాటిన వారంద‌రూ వ్యాక్సినేట్ అయిన‌ట్లు గణాంకాలు చెబుతున్నాయి.నిత్యావసరాలతో పాటు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆదివారం అర్థ‌రాత్రి నుంచే కొన్ని వ్యాపార స‌ముదాయాల‌ను నిర్వాహకులు తెరిచారు.

Advertisement

క‌రోనా ఆంక్ష‌లను అధికారులు ఇప్ప‌టికే 80 శాతంమేర సడలించారు.

కాగా, న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 496 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.గత కొన్ని వారాలుగా సిడ్నీలో కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుండగా.మెల్‌బోర్న్‌లో మాత్రం ఉద్ధృతి ఎక్కువగా వుంది.మెల్‌బోర్న్ సహా విక్టోరియా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1612 మంది కోవిడ్ బారినపడగా.8 మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా వుండటంతో ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద నగరమైన సిడ్నీలో ఈ ఏడాది జూన్ 26న ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.

ఆ తర్వాత నెమ్మదిగా దేశమంతా విస్తరించింది కరోనా.దీంతో ఆగస్టు 5న మెల్‌బోర్న్‌లో.ఆగస్టు 12న దేశ రాజధాని కాన్‌బెర్రాలో లాక్‌డౌన్‌ను విధించారు.

విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతంలో కోవిడ్ ప్రభావం లేదు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు