పొలం కోసం మహిళపై దాడి.. అ భాగంలో నరికి దారుణంగా..!

మహిళ పొలం పై కన్నేసిన కబ్జాదారుడు పొలం ఇవ్వకపోవడంతో ఇంట్లోకి ప్రవేశించి ఆ మహిళ రొమ్ములను నరికి విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన బీహార్ లోని( Bihar ) బెగుసరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 Attack On Woman For Her Farm Land In Bihar Begusarai Details, Attack ,woman , Fa-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బెగుసరాయ్ జిల్లాలోని( Begusarai ) తియాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మల్లిపూరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే.మల్లిపూరం గ్రామంలో పాశ్వాన్( Pashwan ) అనే వ్యక్తి స్థానికంగా గూండా రాజకీయాలు చేస్తుంటాడు.అయితే పాశ్వాన్ కన్నేసిన పొలంలో( Farm Land ) ఆ గ్రామానికి చెందిన ఒక మహిళకు ఒకటిన్నర ఎకరం భూమి ఉంది.పాశ్వాన్ తో పాటు అతని సహాయకులు ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇవ్వాలని బాధితురాలిపై ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసిన ఆమె పొలం ఇవ్వడానికి నిరాకరించింది.

కనీసం సగం భూమి అయిన ఇవ్వాలని ఆ మహిళను బెదిరించినా కూడా ఆమె ససేమిరా అనేసింది.

Telugu Attack, Begusarai, Bihar, Farm, Mallipuram, Pashwan, Sadar-Latest News -

మహిళ గ్రామంలో ఒంటరిగా జీవిస్తోంది.ఆమె భర్త, కుమారుడు వేరే రాష్ట్రంలో ఉన్నారు.శుక్రవారం అర్ధరాత్రి సుమారుగా 11 గంటల సమయంలో పాశ్వాన్ తో పాటు అతని సహాయకులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి బెదిరించినా కూడా ఆమె పొలం ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి ఆమె రొమ్ములను నరికేసి అక్కడి నుండి పరారయ్యారు.

Telugu Attack, Begusarai, Bihar, Farm, Mallipuram, Pashwan, Sadar-Latest News -

ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారంతా వచ్చి ఆమెను భగవాన్ పూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.అక్కడ వైద్యులు ఆమెను సదర్ ఆసుపత్రికి( Sadar Hospital ) తరలించారు.పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాధితురాలు నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు.దయానంద్ పాశ్వాన్ తో పాటు అతని సహాయకులపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube