దారుణం: మామిడికాయ దొంగతనం చేశాడని.. చివరకు..?!

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో తొర్రూరు అనే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు తమ కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ వెళ్లారు.

చివరకు పట్టణ శివారులో ఉన్న మామిడి తోట లోకి కుక్క వెళ్ళిందేమో అనే ఉద్దేశ్యంతోనే వారిద్దరు తోటలోనికి ప్రవేశించారు.

మామిడి తోటలో ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఆ చెట్లకు మామిడి కాయలు బాగా కాశాయి.పిల్లలు అవి ఏమీ గమనించకుండా తమ కుక్క కోసం వెతుకులాట ప్రారంభించారు.

Atrocity: That The Mango Was Stolen Finally Mango Stolen, Viral News, Viral La

కానీ అక్కడ ఉన్న కాపలాదారుడు వారిద్దరు మామిడి కాయలను దొంగతనం చేయడానికి వచ్చారని భావించి.వారిని పట్టుకొని తాళ్లతో చెట్టుకు కట్టేసి వాతలు పడేలా చితకబాదారు.

మేము దొంగతనం చేయడానికి రాలేదు అని ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా బాగా చిత్రహింసలు పెట్టారు.అంతటితో ఆగకుండా పేడను తెచ్చి ఆ పిల్లల చేత తినిపించారు.

Advertisement

ఆ పిల్లలు మీ కాళ్లు పట్టుకుంటాను మేము మామిడికాయలు దొంగతనానికి రాలేదు అని ఎంత బ్రతిమాలి చెప్పిన వాళ్ల మనసు ఏమాత్రం కరగలేదు.ఆ సమయంలో వీరి అరాచకత్వం వీడియో తీయడం కూడా జరిగింది.

ఈ వీడియో బయటికి రావడంతో పిల్లల యొక్క తల్లిదండ్రులు గమనించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దాంతో వారిపై కేసు నమోదు చేశారు.

ఎంతైనా చిన్నపిల్లలను చిత్రహింసలు పెట్టడం చాలా తప్పు.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు