కరీంనగర్ జిల్లా ఆకునూర్లో దారుణం జరిగింది.మూడు రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సదరు వ్యక్తిని హత్య చేసి గుంతలో పూడ్చి పెట్టినట్లు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంతను తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు.
అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.