చెడు వ్యసనాలకు బానిస అయిన కొడుకు మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవకు దిగి క్షణికావేశంలో పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.హత్యకు గల కారణాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్ పూర్ మండలం తోగిట గ్రామంలో కుస్తి నర్సమ్మ(45) నివాసం ఉంటుంది.
నర్సమ్మ కు భాను ప్రకాష్, బాలు అనే ఇద్దరు కుమారులు సంతానం.నర్సమ్మ వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
గురువారం అర్ధరాత్రి పీకల దాకా మద్యం తాగి ఇంటికొచ్చిన భాను ప్రకాష్ తనకు డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు.
కాసేపు తల్లి, కొడుకు మధ్య మాటల యుద్ధం జరిగాక మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో మర్చిపోయిన భాను ప్రకాష్ ఆవేశంతో కత్తితో తల్లిని పొడిచి హత్య చేశాడు.
వెంటనే నర్సమ్మ కుప్పకూలిపోయి క్షణాల్లో ప్రాణాలను విడిచింది.

తల్లి చనిపోయిన తర్వాత బయటకు వచ్చి తన తల్లిని తానే చంపేశానని గట్టిగా కేకలు వేశాడు.చుట్టుపక్కల ఉండే స్థానికులు వచ్చి సంఘటనను చూసి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హత్య చేసిన నిందితుడు భాను ప్రకాష్( Bhanu Prakash ) ను అదుపులోకి తీసుకొని, హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.ఈ హత్య సంఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది.
ఇటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు.







