హైదరాబాద్ లోని హయత్ నగర్ తట్టి అన్నారంలో దారుణ ఘటన జరిగింది.వైఎస్ఆర్ కాలనీకి చెందిన టెన్త్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇంట్లోకి చొరబడిన ఐదుగురు విద్యార్థులు అత్యాచారం చేశారు.అనంతరం ఆ ఘటనను వీడియో తీసిన నిందితులు విషయాన్ని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియోలు పెడతామంటూ విద్యార్థినిని బెదిరింపులకు గురి చేశారు.
బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.







