ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రధానంగా జనసేన పార్టీ( Janasena party ) గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీల నేతలకు ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది.

జనసేన పోటీ చేసే చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకుండా మిగతా చోట్ల ఈ గుర్తును ఫ్రీ సింబల్ గా చేర్చింది.దీంతో ఈ ఎన్నికలలో పోటీ చేసే చాలామంది.

రెబల్స్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని పోటీ పడుతున్నారు.

At This Stage The Mark Of The Glass Glass Cannot Be Changed Said Ec, Ap Electio

ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులకు( independent candidates ) గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.దీని వల్ల తమ కూటమికి నష్టం కలుగుతుందని టీడీపీ( TDP ) తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో గుర్తు మార్చలేమని ఈసీ తరఫు లాయర్ వాదించారు.

Advertisement
At This Stage The Mark Of The Glass Glass Cannot Be Changed Said EC, AP Electio

దీంతో తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం వల్ల జనసేన పోటీ చేయని చోట్ల.తెలుగుదేశం పార్టీకి భారీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది.

దీంతో ఏదో రకంగా గాజు గ్లాస్ గుర్తును పూర్తిగా జనసేనకే పరిమితమయ్యే విధంగా తెలుగుదేశం పోరాడుతుంది.

Advertisement

తాజా వార్తలు