ఈ మధ్య సెలబ్రిటీలలో పెళ్లయిన వాళ్లు కూడా తమ అందాలతో ఏమాత్రం తగ్గట్లేదు.ఇప్పటికే బుల్లితెరపై యాంకర్ అనసూయ పెళ్లి పిల్లలు ఉన్నా కూడా తన అంద చందాలతో అందర్నీ ఫిదా చేస్తుంది.
అలా బుల్లితెర కాకుండా వెండితెర నటులు కూడా పెళ్లై పిల్లలు ఉన్నా కూడా బాగా గ్లామర్ షోలు చేస్తున్నారు.అయితే పెళ్లయిన వాళ్ళు అలా షో చేయటం వల్ల నెటిజన్స్ వారిపై బాగా ఫైర్ అవుతున్నారు.
భర్త ఉన్న కూడా తాళిబొట్టు లేకుండా తిరుగుతున్నారు.ముఖ్యంగా అచ్చమైన తెలుగు సాంప్రదాయానికి చెందిన వాళ్లు కూడా అలాగే తయారవుతున్నారు.
దీంతో వారిపై బాగా విమర్శలు చేస్తూ ఉంటారు నెటిజన్స్.తాజాగా శివ జ్యోతి కూడా అలాగే రెడీ అవ్వడంతో తనపై బాగా ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
శివ జ్యోతి పేరు కంటే తీన్మార్ సావిత్రి అనే పేరుతెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం.
తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.
అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతేకాకుండా తనతో పాటు మరో యాంకర్ బిత్తిరి సత్తి కూడా అందరికీ తెలిసిందే.
ఇక అతనితో తమ్ముడు అనుకుంటూ మాటలతో బాగా సందడి చేసేది.పైగా అందులో సావిత్రి కట్టుబొట్టు కూడా బాగా ఉండేది.
దాంతో తీన్మార్ వార్తలు రేటింగు లో కూడా మొదటి స్థానంలో ఉండేది.అలా మనకు పరిచయమైన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి.
ఈమె తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, నాగంపేట గ్రామానికి చెందినది.ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.
ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.ఇక అలా v6 లో తీన్మార్ సావిత్రిలా, బుగ్గల జాకెట్ ధరించుకున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత సావిత్రికి బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.
ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.
పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.
మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.ఈమె అచ్చమైన తెలంగాణకు చెందిన కూడా తన సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసింది. గ్లామర్ షో కి అలవాటు పడుతూ మెడలో తాళిబొట్టు, బొట్టు పెట్టుకోకుండా బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
తాజాగా తను కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో కూడా బొట్టు లేకుండా కనీసం మెడలో తాళిబొట్టు కూడా లేకుండా కనిపించడంతో ఈమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు. కనీసం మెడలో తాళిబొట్టు వేసుకొని, కనీసం బొట్టయిన పెట్టుకొని మీ భర్తకు గౌరవం ఇవ్వండి అంటూ ఫైర్ అవుతున్నారు.