భారతీయ పీహెచ్‌డీ విద్యార్ధులకు కెనడా( Canada ) షాకిచ్చింది.ఆ దేశంలో జరగనున్న కాన్ఫరెన్స్ ఆప్ కంప్యూటర్ విజన్ అండ్ ప్యాటర్న్ రికగ్నిషన్ (సీవీపీఆర్)కు హాజరయ్యేందుకు భారతీయ విద్యార్ధులు పెట్టుకున్న వీసా దరఖాస్తులను( Visa applications ) కెనడా తిరస్కరించింది.
నలుగురిలో ముగ్గురు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) విజన్ అండ్ ఏఐ ల్యాబ్స్ (వీఏఎల్)కు చెందినవారే.నాల్గవది ఐఐఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పీహెచ్‌డీ విద్యార్ధిది.
భారత్‌లో పరిమిత ఉపాధి అవకాశాలు, తాత్కాలిక బస వంటి దిగ్భ్రాంతికరమైన కారణాలతో తమ వీసా దరఖాస్తులను కెనడా ప్రభుత్వం తిరస్కరించిందని బాధిత విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీఏఎల్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేష్ బాబు జాతీయ మీడియా సంస్థతో ఈ విషయంపై మాట్లాడుతూ.
కెనడా నుంచి ఈ తరహా స్పందనను తాము ఊహించలేదన్నారు.విద్యార్థులకు సహజంగా ఇలాంటి పరిస్ధితి ఎదురుకాదన్నారు.
ప్రత్యేకించి ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వుండదన్నారు.తమ విద్యార్ధులకు అవసరమైన ట్రావెలింగ్ ఫండ్స్ కూడా దండిగా వున్నాయని వెంకటేష్ బాబు చెప్పారు.
కెనడాలో జరిగే సీవీపీఆర్ సదస్సుకు తాము ప్రతియేటా క్రమం తప్పకుండా హాజరవుతున్నామని.గతంలో ఎన్నడూ ఎదురవ్వని సమస్య ఇప్పుడే ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదన్నారు.

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్సీ.ప్రపంచంలోని అగ్రశ్రేణి భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వుందని ఆయన తెలిపారు.అలాంటి సంస్థకు చెందిన విద్యార్ధుల వీసా దరఖాస్తును తిరస్కరించడం తమను నిరుత్సాహపరిచిందన్నారు.ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు Google, MetaAI, Boeing వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలలో అలాగే Google India, Microsoft India , Amazon India భారతీయ శాఖలలోనూ ఉద్యోగాన్ని పొందారని వెంకటేష్ బాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల వీసా దరఖాస్తులను పునఃపరిశీలించాలని కెనడా అధికారులను, అదే సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా భారత విదేశాంగ శాఖను ఆయన కోరారు.

వెంకటేష్ బాబు చెబుతున్న దాని ప్రకారం.నలుగురు విద్యార్థులలో ఇద్దరు Prime Minister’s Research Fellows (PMRF) Schemeలో సభ్యులు .బాధిత విద్యార్ధులను హర్ష్ రంగ్వానీ (పీహెచ్‌డీ నాలుగో సంవత్సరం) , అభిప్సా బసు (పీహెచ్‌డీ మూడవ సంవత్సరం), మిగిలిన ఇద్దరు సిద్ధార్ద్ అశోకన్ (పీహెచ్‌డీ ఆరవ సంవత్సరం), సమ్యక్ జైన్ (సిద్ధార్ వద్ద ఇంటర్న్ చేస్తున్న విద్యార్ధి).వీరిలో రంగ్వానీ, బసులు ఐఐఎస్సీ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వీఏఎల్‌తో పనిచేస్తున్నారు.సిద్ధార్ అశోకన్ ఎలక్ట్రికల్త ఇంజనీరింగ్ విభాగానికి చెందినవాడు.
